చండీఘడ్: పంజాబ్ లోని అమృత్సర్ ఎంపీ గుర్మీత్ సింగ్ ఔజ్లాపై ప్రశంసలు కురుస్తున్నాయి. లోక్సభలో స్మోక్ క్యాన్లతో అటాక్ చేసిన ఓ నిందితుడిని ఎంపీ గుర్మీత్ సింగ్ పట్టుకున్నారు. దీంతో ఆయన్ను సింగ్ ఈజ్ కింగ్ అంటూ కీర్తిస్తున్నారు. లోక్సభలో నా తోటి సభ్యుడు, చాలా ధైర్యసాహసాలు ప్రదర్శించి నిందితుడిని పట్టుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) తన ట్వీట్లో తెలిపారు. లోక్సభలో జరిగిన ఘటన గురించి ఎంపీ ఔజ్లా మాట్లాడుతూ.. హౌజ్ చాంబర్లోకి ఇద్దరు వ్యక్తులు దూకడానికి కొద్దిసేపటి క్రితమే తాను సభలో ప్రశ్న వేసినట్లు చెప్పారు. చైర్ వైపు వెళ్తున్న మరో వ్యక్తిని హనుమాన్ బెనివాల్ పట్టుకున్నట్లు చెప్పారు. రెండో వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో.. అతని చేతుల్లో ఏదో ఉందని గుర్తించామని, ఆ వస్తువును అతని చేతుల్లోకి లాగేసి, దూరం విసిరేశామని, ఎందుకంటే అది గ్యాస్ రిలీజ్ చేస్తోందని ఎంపీ గుర్మీత్ తెలిపారు. బుధవారం లోక్సభలో ఇద్దరు వ్యక్తులు దూకి తమ వద్ద ఉన్న గ్యాస్ క్యాన్లతో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే.
Singh is King! Awesome Aujla, my brave colleague, who confronted the intruder in the Lok Sabha…. https://t.co/eTRdWQWML2
— Shashi Tharoor (@ShashiTharoor) December 13, 2023