ముంబై: రాజీనామాపై ఎన్సీపీ మాజీ చీఫ్ శరద్ పవార్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తున్నది. అధ్యక్ష పదవికి మంగళవారం ఆయన రాజీనామా చేయగా, కొనసాగాలని పార్టీలో మెజారిటీ వర్గం ఒత్తిడి తెచ్చింది. దీంతో పునరాలోచిస్తానని, రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. మరోపక్క వారసుడి ఎంపికకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేను అధ్యక్షురాలిగా ఎన్నుకోనున్నట్టు చగ్గన్ భుజ్బల్ ప్రకటించారు. పవార్ కొనసాగకపోతే అజిత్ పవార్ రాష్ట్ర, సుప్రియ జాతీయ రాజకీయాలను చూస్తారని చెప్పారు.