ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు హాట్‌గా మారుతున్నాయి. అజిత్ పవర్ తిరుగుబాటు నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో సంక్షోభం (NCP crisis) నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అజిత్ పవర్ తిరుగుబాటుకు మద్దతిచ్చిన నేతలపై వేటు వేశారు. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ తట్కరేను పార్టీ నుంచి తొలగించారు. కుమార్తె, వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే రాసిన లేఖపై స్పందించిన శరద్ పవార్ ఈ మేరకు చర్యలు చేపట్టారు. ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్‌ను పార్టీ సభ్యుల రిజిస్టర్ నుంచి తొలగించాలని నేను ఆదేశించాను’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాగా, దీనికి ముందు ఎన్సీపీ మరిన్ని చర్యలు చేపట్టింది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరైన ముగ్గురు నేతలపై వేటు వేసింది. ముంబై డివిజన్ ఎన్సీపీ అధ్యక్షుడు నరేంద్ర రాథోడ్, అకోలా సిటీ జిల్లా అధ్యక్షుడు విజయ్ దేశ్‌ముఖ్, పార్టీ ప్రాంతీయ కార్యదర్శి శివాజీరావు గార్జేను పార్టీ నుంచి తొలగించింది.
మరోవైపు షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్, ఆయన వర్గం ఎమ్మెల్యేలపై ఎన్సీపీ క్రమశిక్షణ కమిటీ చర్యలు చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను కోరింది. దీనిపై స్పందించిన స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఎన్పీపీ లేఖ రాసింది.
I, as the National President, Nationalist Congress Party hereby order removal of the names of Shri Sunil Tatkare and Shri Praful Patel from the Register of Members of NCP Party for anti-party activities.@praful_patel @SunilTatkare
— Sharad Pawar (@PawarSpeaks) July 3, 2023
Mr.Sunil Tatkare and Mr. Praful Patel on 2nd July 2023 acted in direct contravention of the Party Constitution and Rules, amounting to desertion and disqualification from the party membership.
I request Hon. @PawarSpeaks Saheb to take immediate action and file disqualification… pic.twitter.com/Uj2iG6C6kz
— Supriya Sule (@supriya_sule) July 3, 2023
#WATCH | NCP leader Praful Patel, says "We are the NCP and that is what we are doing. We will decide now if I have to go to Delhi. We have not discussed anything about Delhi, we have only discussed about the formation of our government in Maharashtra" pic.twitter.com/Wp4e3X7RIi
— ANI (@ANI) July 3, 2023