ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కీలక నేత, మేనల్లుడు అజిత్ పవార్‌కు పార్టీలో ఉన్నత పదవి ఎందుకివ్వలేదన్న దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) వివరణ ఇచ్చారు. ఆయన ఇప్పటికే పార్టీలో చాలా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కుమార్తె సుప్రియా సూలే, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎంపిక చేయడం అజిత్ పవార్‌ను దిగజార్చడం కాదని చెప్పారు. పార్టీలో నిర్ణయం తీసుకునే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇద్దరిని నియమించడానికి గల కారణాన్ని కూడా శరద్ పవార్ వివరించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల బాధ్యతలను ఒకే వ్యక్తికి అప్పగించడం సరికాదని అన్నారు. దేశ వ్యాప్తంగా పార్టీ వ్యవహారాలు చూసేందుకు ఇద్దరిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా చేయాలని ఎన్సీపీ నాయకత్వం నిర్ణయించిదని చెప్పారు.
కాగా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, గోవా బాధ్యతలతోపాటు రాజ్యసభ ఎన్సీపీ ఇన్‌ఛార్జ్‌గా ప్రఫుల్ పటేల్ వ్యవహరిస్తారని శరద్ పవార్ తెలిపారు. అలాగే మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ ఎన్సీపీ బాధ్యతలతోపాటు మహిళలు, యువత, విద్యార్థులు, లోక్‌సభకు సంబంధించిన పార్టీ వ్యవహారాలను సుప్రియా సూలే చూస్తారని చెప్పారు. శనివారం జరిగిన ఎన్సీపీ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనను నియమించకపోవడంపై ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ అసంతృప్తి చెందినట్లుగా కనిపించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడకుండా పార్టీ కార్యాలయం నుంచి ఆయన వెళ్లిపోయారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎన్నికైన సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌ను ట్విట్టర్ ద్వారా ఆయన అభినందించారు. 2019లో బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీని చీల్చేందుకు ప్రయత్నించారు. అయితే శరద్ పవార్ కుటుంబం బుజ్జగించడంతో అజిత్ పవార్ వెనక్కి తగ్గారు.
राष्ट्रवादी काँग्रेस पक्षाच्या २४ व्या वर्धापन दिनी आदरणीय शरदचंद्र पवार साहेबांच्या मार्गदर्शनाखाली खासदार प्रफुल्लभाई पटेल आणि खासदार सुप्रियाताई सुळे यांची पक्षाच्या कार्यकारी अध्यक्षपदी निवड करण्यात आली. तसंच खासदार प्रफुल्लभाई पटेल, खासदार सुप्रियाताई सुळे, खासदार सुनिल…
— Ajit Pawar (@AjitPawarSpeaks) June 10, 2023