ముంబై: మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) శనివారం కీలక ప్రకటన చేశారు. తన కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌ను ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వెల్లడించారు. 1999లో పీఏ సంగ్మాతో కలిసి ఎన్సీపీని ఏర్పాటు చేసిన శరద్ పవార్, ఆ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. గతంలో పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించిన మేనల్లుడు, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ సమక్షంలోనే శరద్ పవార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కాగా, శరద్ పవార్ గత నెలలో ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించడంతోపాటు ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగాలని సూచించింది. పార్టీ నేతలు నచ్చజెప్పడంతో శరద్ పవార్ తన మనసు మార్చుకున్నారు. ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించారు. అయితే పార్టీ వారసుల అంశంపై చర్చకు ఇది దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌ను శరద్ పవార్ ప్రకటించారు.
#WATCH | NCP chief Sharad Pawar appoints Praful Patel and Supriya Sule as working presidents of the party pic.twitter.com/v8IrbT9H1l
— ANI (@ANI) June 10, 2023
I am grateful to NCP President Hon. Pawar Saheb and all the Senior Leaders, party colleagues, party workers and well wishers of @NCPSpeaks for bestowing this huge responsibility of Working President along with Hon. @praful_patel Bhai.
To my fellow members of the party, because…
— Supriya Sule (@supriya_sule) June 10, 2023