మంగళవారం 31 మార్చి 2020
National - Mar 23, 2020 , 11:04:24

క‌రోనా ఎఫెక్ట్‌: మార్చి 31 వ‌ర‌కు షార్ ష‌ట్‌డౌన్‌

క‌రోనా ఎఫెక్ట్‌:  మార్చి 31 వ‌ర‌కు షార్ ష‌ట్‌డౌన్‌

నెల్లూరు : క‌రోనా వైర‌స్ కార‌ణంగా జ‌న‌జీవ‌నం ఎక్క‌డిక‌క్క‌డే స్తంభించిపోయింది. షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు, విద్యాల‌యాలు, కార్యాల‌యాలు ఇలా అన్నీ మూత‌ప‌డ్డాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని రాకెట్ ప్ర‌యోగ కేంద్ర‌మైన శ్రీహ‌రికోట‌ రేంజ్ (షార్‌పై)పై క‌రోనా ఎఫెక్ట్ ప‌డింది. మార్చి 31 వ‌ర‌కు షార్ ను షట్‌డౌన్ చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఈ నెల 31 వ‌ర‌కు షార్‌లోని స‌తీశ్ ధావన్ స్పేస్ సెంట‌ర్ (ఎస్‌డీఎస్‌సీ) నుంచి అన్ని ర‌కాల రాకెట్ ప్ర‌యోగాల‌ను నిలిపివేస్తున్న‌ట్టు తెలిపారు. 

అయితే, అత్య‌వ‌స‌ర విభాగాల ఉద్యోగులు మాత్రం త‌మ షిఫ్టుల్లో విధుల‌కు హాజ‌ర‌య్యేలా ఆయా విభాగాల అధిప‌తులు ఏర్పాట్లు చేసుకోవాల‌ని షార్ ఉన్న‌తాధికారులు స‌ర్క్యుల‌ర్ జారీచేశారు. ఇత‌ర ఉద్యోగుల‌కు సంబంధించిన జ‌న‌రల్ షిఫ్టుల‌ను మాత్రం పూర్తిగా ర‌ద్దు చేశారు. మ‌రోవైపు షార్‌లో జ‌రుగుతున్న నిర్మాణ ప‌నులను సైతం అధికారులు నిలిపివేశారు.    
logo
>>>>>>