తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ(Kerala Assembly)లో డిప్యూటీ స్పీకర్‌గా కాంగ్రెస్ నేత షానిమోల్ ఉస్మాన్ ఎన్నికయ్యారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి మొహమ్మద్ ముషిన్పై ఆమె గెలుపొందారు. షానిమోల్కు 99 ఓట్లు పోలయ్యాయి. ముషిన్కు 34 ఓట్లు పడ్డాయి. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. స్పీకర్ తిరువంచూర్ రాధాకష్ణణ్ ఓటింగ్‌లో పాల్గొన్నలేదు. కేరళ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పోస్టుకు ఎన్నికైన నాలుగవ మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. కేఓ అయేషా బాయ్, నఫీసాత్ బీవీ, భార్గవి థంకప్పన్ గతంలో డిప్యూటీ స్పీకర్లుగా చేశారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమికి 102 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. స్పీకర్‌ను మినహాయిస్తే, ఆమెకు 101 ఓట్లు రావాలి. కానీ షానిమోల్కు 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఎవరు ఓటు వేయలేదన్న దానిపై క్లారిటీ లేదు. ఇక ప్రత్యర్థి ఎల్డీఎఫ్ కూటమిలో 35 మంది ఉన్నారు. కానీ 34 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ ప్రక్రియ నుంచి బీజేపీ దూరంగా నిలిచింది. అలప్పుజా జిల్లాలోని ఆరూర్ నియోజకవర్గంకు షానిమోల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.