ముంబై, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత మహారాష్ట్రలో దారుణం జరిగింది. బీడ్ జిల్లాలోని మజల్గావ్ తాలూకాలో ఇద్దరు మైనర్ బాలికలపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఛత్తీస్గఢ్ నుంచి చెరుకు కోయడానికి వచ్చిన ఒక కుటుంబం మజల్గావ్ తాలూకాలో నివసిస్తున్నది.
ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు చెరుకు కోత పని కోసం వారి తల్లిదండ్రులతో ఇకడికి వచ్చారు. డిసెంబర్ 24న, బాలికలు ఒంటరిగా ఉన్నప్పుడు, గ్రామానికి చెందిన గణేశ్ ఘాటుల్, అశోక్ పవార్ వారిపై అత్యాచారం చేశారు. కొన్ని రోజుల తర్వాత, ఒక బాలిక అస్వస్థతకు గురై తన కుటుంబ సభ్యులకు ఈ ఘటన గురించి చెప్పింది. ఆ కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.