బెంగళూరు: జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను వచ్చే నెల 1 వరకు సీఐడీ కస్టడీకి బెంగళూరు కోర్టు అనుమతించింది. జేడీఎస్ పురుష కార్యకర్తపై అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు సూరజ్‌పై ఈ నెల 22న హోలెనరసిపుర పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి ప్రభుత్వం అప్పగించింది.
హసన్ పోలీసులు ఆయనను సోమవారం మేజిస్ట్రేట్ సమక్షంలో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆయనను 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీఐడీ అధికారులు స్వీకరించి, సూరజ్‌ను ప్రశ్నించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని సోమవారం ప్రత్యేక కోర్టును కోరారు. దీంతో జడ్జి వచ్చే నెల 1 వరకు సూరజ్‌ను సీఐడీ కస్టడీకి ఆదేశించారు.