Eknath Shinde: ఏక్నాథ్ షిండే క్యాంపులో చేరిన ఆరు మంది సేన రెబల్ ఎంపీలు
Eknath Shinde : ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన ఆరు మంది ఎంపీలు ఇవాళ ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీలో చేరారు. ముంబైలో జరిగిన ప్రెన్స్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ముంబై: అనుకున్నట్లే జరిగింది. ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన ఆరు మంది ఎంపీలు ఇవాళ ఏకనాథ్ షిండే(Eknath Shinde) వర్గానికి చెందిన శివసేన పార్టీలో చేరారు. ముంబైలో జరిగిన ప్రెన్స్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉద్ధవ్ టీమ్‌లో మొత్తం 9 మంది ఎంపీలు ఉండగా, దాంట్లో ఇప్పుడు ఆరు మంది ఎంపీలు షిండే వర్గంలో చేరారు. దీంతో ఊహాగానాలకు బ్రేక్ పడింది. ఏక్నాథ్ వర్గంలో చేరిన ఎంపీల్లో ఓమ్రాజే నింబాల్కర్(ధారాశివ్), సంజయ్ దినా పాటిల్(ముంబై నార్త్ ఈస్ట్), సంజయ్ జాదవ్(పర్బని), సంజయ్ దేశ్ముక్(యవత్మాల్-వాసిమ్), నగేశ్ పాటిల్ అస్తికర్(హింగోలి), బౌసాహెబ్ వక్చౌరే(షిర్డి) ఉన్నారు.
రెబల్స్ ఎంపీలే షిండే వర్గంలో చేరడంలో సేన యూబీటీ సంఖ్య కేవలం మూడుకు పడిపోయింది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తప్పుకునేందుకు రెబల్స్‌కు మూడో వంతు మెజారిటీ కూడా ఉన్నది. ఆరు పులులు ఇక్కడే ఉన్నాయని, వాళ్లు ఇప్పుడు రియల్ శివసేన ఫ్యామిలీలో కలిశారని, రియల్ శివసేన ఫ్యామిలీకి వెల్కమ్ చెబుతున్నానని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే తెలిపారు. శివసేన పార్టీని కాపాడుకునేందుకు గతంలో తాము రెబల్స్‌గా మారామని, ఇప్పుడు రెండో దశ ప్రారంభమైందన్నారు.
Mumbai: Maharashtra Deputy CM and Shiv Sena chief Eknath Shinde says, “Today, 6 MPs have joined us. Sanjay Haribhau Jadhav, Bhausaheb Rajaram Wakchaure, Omprakash Bhupalsingh Nimbalkar, Sanjay Dina Patil, Sanjay Uttamrao Deshmukh and Nagesh Bapurao Patil Ashtikar. So we have 3… https://t.co/7glFSnOLXx pic.twitter.com/J99daG9PHN
— ANI (@ANI) June 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

