Sex Ratio | న్యూఢిల్లీ: మన దేశంలో స్త్రీ, పురుష సమానత్వంలో ఆశాజనక ధోరణి కనిపిస్తున్నదని కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. 2036నాటికి ప్రతి 1,000 మంది పురుషులకు 952 మంది మహిళలు ఉంటారని అంచనా వేసింది. 2011నాటి లెక్కల ప్రకారం, ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండేవారని తెలిపింది.
2011నాటి జనాభాలో మహిళల సంఖ్యతో పోల్చితే, 2036లో ఎక్కువ మంది మహిళలు ఉంటారని అంచనా వేసింది. 2011నాటి జనాభాలో 48.5 శాతం మంది మహిళలు ఉన్నారని, 2036నాటికి జనాభా 152.2 కోట్లకు చేరుతుందని, దీనిలో మహిళల జనాభా 48.8 శాతానికి పెరుగుతుందని వివరించింది. 15 ఏళ్ల లోపు బాలల సంఖ్య 2011లో కన్నా 2036లో తగ్గుతుందని, సంతానోత్పత్తి తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది.