చెన్నై: తమిళనాడులో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ హరి పద్మన్(Assitatn Professor Hari Padman)పై లైంగిక దాడి కేసు నమోదు అయ్యింది. చెన్నైలోని సాంప్రదాయ కళలను బోధించే ప్రతిష్టాత్మక కళాక్షేత్ర ఫౌండేషన్(Kalakshetra Foundation)లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై ఓ మాజీ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేశారు. హరి పద్మన్‌కు వ్యతిరేకంగా ఇవాళ సుమారు రెండు వందల మంది స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. ఆ ప్రొఫెసర్‌ను తమను లైంగికంగా వేధిస్తన్నారని, దుర్భాషలాడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు.
అయితే గతంలో ఆ ప్రొఫెసర్ ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రొఫెషర్పై దుష్ ప్రచారం చేస్తున్నట్లు జాతీయ మహిళా కమీషన్ గతంలో ఆరోపించింది. అయితే సుమారు 90 మంది స్టూడెంట్స్ రాష్ట్ర మహిళా కమీషన్(State Womens Commission)కు శుక్రవారం ఫిర్యాదును అందజేశారు. నిందితులపై కఠినంగా లీగల్ చర్యలు తీసుకోనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) తెలిపారు.