క్యాన్సర్ ఔషధాలకు తీవ్ర కొరత!
క్యాన్సర్ చికిత్సలో భాగంగా నిర్వహించే కీమోథెరపీలో ముఖ్యంగా వాడే రెండు ప్రధాన ఔషధాలకు దేశ వ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. చికిత్సలో వినియోగించే సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ ఔషధాలు మార్కెట్లో లభ్యం కావడం లేదని, వీటికి తీవ్ర కొరత ఉందని క్యాన్సర్ రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- రోగుల ఆందోళన పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రమాదమంటున్న వైద్యులు
న్యూఢిల్లీ, జూన్ 5: క్యాన్సర్ చికిత్సలో భాగంగా నిర్వహించే కీమోథెరపీలో ముఖ్యంగా వాడే రెండు ప్రధాన ఔషధాలకు దేశ వ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. చికిత్సలో వినియోగించే సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ ఔషధాలు మార్కెట్లో లభ్యం కావడం లేదని, వీటికి తీవ్ర కొరత ఉందని క్యాన్సర్ రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వార, అండాశయ, తల, మెడ క్యాన్సర్ చికిత్సలో ఈ రెండు మందులను విస్తృతంగా వాడుతుంటారు. అయితే దేశ వ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఈ రెండు మందుల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో రోగులకు వైద్యం అందించడంలో ఆలస్యమవుతున్నదని, ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను అవలంబించాల్సి వస్తున్నదని డాక్టర్లు తెలిపారు. మందుల కొరత కారణంగా దేశవ్యాప్తంగా సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.
ఆందోళనకరంగా పరిస్థితి
గత నాలుగు నెలలుగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఈ ఔషధాలలో వాడే కీలక పదార్థం ప్లాటినం ధరలు అధికంగా పెరిగాయని, అందుకే వీటికి కొరత ఏర్పడిందని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తప్పనిసరిగా వైద్య చికిత్స అందించాల్సిన రోగుల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎయిమ్స్, ఢిల్లీ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎండీ రే తెలిపారు. ‘ప్రస్తుతం ఔషధ నిల్వల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉన్న సరుకు ఒకటి రెండు రోజులకే సరిపోతుంది. ఆ తర్వాత పరిస్థితి విపత్కరమవుతుంది’ అని సర్ గంగారామ్ హాస్పిటల్ చైర్మన్ శ్యామ్ గార్గ్ పేర్కొన్నారు. ముడి సరుకు ధరలు పెరిగినందున క్యాన్సర్ మందుల ధరలను పెంచాలంటూ తయారీదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పెంచకపోడంతో.. నష్టాలకు వాటి తయారీని తగ్గించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

