న్యూఢిలీ : యుద్ధవిమానాల తయారీలో ఆలస్యంపై భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009-10లో ఆర్డర్ ఇచ్చిన 40 తేజస్ యుద్ధ విమానాలు ఇంకా పూర్తిగా అందలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 21వ సుబ్రొతో ముఖర్జీ సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా లాంటి భారత ప్రత్యర్థి దేశాలు వాయుసేనపై భారీగా నిధులను వెచ్చిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 14 ఏండ్లు గడిచినా 40 తేజస్ విమానాలు పూర్తిగా అందలేదన్నారు. .‘ఈ రంగంలోకి కొన్ని ప్రైవేటు సంస్థలు రావాల్సిన అవసరం ఉంది. పోటీతత్వం ఉండాలి. లేకపోతే పరిస్థితులు మారవు’ అని పేర్కొన్నారు.