Bomb Threats | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) సర్వసాధారణమైపోయాయి. ఇటీవలే కాలంలో పాఠశాలలు, విమానాశ్రయాలు, హోటల్స్‌కు వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు కళాశాలలకు (Several major colleges) ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
Karnataka | A bomb threat received by BIT, BMSCE, MSRIT. Bomb disposal squad and related squads on the job to verify the same. Case registered in Hanumanthnagar PS to trace the source: DCP South
— ANI (@ANI) October 4, 2024
సదాశివనగర్‌లో ఉన్న BMSCE, హనుమంత నగర్లో ఉన్న MSRIT, బసవనగుడిలో ఉన్న BIT కళాశాలకు శుక్రవారం బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మూడు కళాశాలలకు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన ఆయా కళాశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సాయంతో (Bomb disposal squad) ఆయా కళాశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read..
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
Ayatollah Ali Khamenei | శత్రువులను ఓడించి తీరుతాం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
YouTube | యూట్యూబ్ కీలక అప్డేట్.. షార్ట్స్ నిడివి మూడు నిమిషాలకు పెంపు