న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని కులు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీని వల్ల అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. తాజా ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. కులు జిల్లాలోని అన్నీ పట్టణంలో తాజాగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి.
#WATCH | Himachal Pradesh: Several houses collapsed due to landslides in Anni town of Kullu district.
(Visuals confirmed by police) pic.twitter.com/K4SkRy5bjk
— ANI (@ANI) August 24, 2023
రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ రెడ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. అన్నీ టౌన్లో ఉన్న భారీ బిల్డింగ్లు కూలిపోయాయి. అయితే రెండు రోజుల క్రితమే ఆ బిల్డింగ్ల నుంచి జనాన్ని తరలించారు. సీఎం సుఖ్విందర్ సింగ్ సూకు ఆదేశాల ప్రకారం ఆ బిల్డింగ్లను ఖాళీ చేశారు. కులు-మండి హైవేపై భారీ వర్షం వల్ల వాహనాలు నిలిచిపోయాయి.