షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లాలో కొండచరియలు(Shimla Landslide) విరిగిపడ్డాయి. మంగళవారం సాయంత్రం కృష్ణ నగర్లో ఇండ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో మొత్తం 8 ఇండ్లు, ఆరు తాత్కాలిక గుడిసెలు శిథిలం అయ్యాయి. కార్ట్ రోడ్‌లోని ఓల్డ్ బస్ స్టాండ్, షిమ్లా బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సిటీలో ఉన్న కబేలా వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. అయితే కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో ఉన్న ఇండ్ల నుంచి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం సుఖ్విందర్ సుఖు తెలిపారు.
Horrifying visuals of another landslide that look place at Krishna Nagar- Shimla today.
The residents of these houses were evacuated earlier this morning by the administration fearing landslide. #HimachalFloods #landslides #shimlafloods #shimla pic.twitter.com/bJNNSn9hhp
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 15, 2023
షిమ్లా, ఫతేపుర్, ఇండోరా ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు ముమ్మురం చేశారు. భారతీయ సైనిక దళానికి చెందిన బృందాలు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఆగస్టు 13వ తేదీ నుంచి కురుస్తున్న వర్షాల వల్ల హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే 66 మంది మరణించారు.