Sonia & G-23 Congress | సోనియా.. జీ-23 నేతల మధ్య రాజీ కుదిరిందా?! కాంగ్రెస్ పయనం ఎటువైపు?!
Sonia & G-23 Congress | కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, జీ-23 నేతల మధ్య రాజీ కుదురుతున్నట్లు కనిపిస్తున్నది.
Sonia & G-23 Congress | కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు పార్టీ నాయకత్వానికి, అసమ్మతి నేతలకు మధ్య రాజీ కుదిరిందా.. జీ-23 నేతల డిమాండ్లకు అధినాయకత్వం తలొగ్గుతుందా? అంటే తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాహుల్ గాంధీతోనూ సమావేశం కావడానికి కసరత్తు చేస్తున్నారు. గురువారం రాహుల్‌తో హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా భేటీ, ఆజాద్‌తో సోనియా సంప్రదింపుల తర్వాత జీ-23 నేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
జీ-23 నేతల అసలు బాధలు ఇవీ
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తమలక్ష్యం అని, కానీ తమ మాట ఒక్కరూ వినే పరిస్థితిలో లేరని జీ-23 గ్రూప్ నేత ఒకరు చెప్పారు. రాహుల్‌తో జరిగిన భేటీలో పార్టీపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటే మీడియా ద్వారా తమ వంటి వారు ఆ వార్తలు తెలుసుకోవాల్సి వస్తుందని సీనియర్లు కినుక వహిస్తున్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో చర్చించాకే కీలక నిర్ణయాలు తీసుకోవాలని జీ-23 నేతలు డిమాండ్ చేస్తున్నారని రాహుల్‌కు హూడా స్పష్టం చేశారని సమాచారం. సోనియాగాంధీకి సమాచారం ఇచ్చాకే జీ-23 నేతలు సమావేశం అవుతున్నామని, తాము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడం లేదని కూడా హుడా చెప్పినట్లు వినికిడి.
వఘేలా, సిబల్ వ్యాఖ్యలతో ఏకీభవించం
కపిల్ సిబల్, శంకర్‌సింగ్ వఘేలా చేసిన వ్యాఖ్యలతో జీ-23 నేతలు ఏకీభవించడం లేదని రాహుల్ దృష్టికి హుడా తెచ్చారు. రాహుల్ గాంధీని నాయకత్వ బాధ్యత నుంచి తప్పించాలని సిబల్, వఘేలా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆజాద్ ఇంట్లో జరిగిన భేటీకి ఐదుగురు మాజీ సీఎంలు, 8-10 మంది కేంద్ర మాజీ మంత్రులు హాజరయ్యారు. ఇప్పుడు అటువంటి వారి సంఖ్య పెరుగుతున్నది అని ఓ అసమ్మతి నేత చెప్పారు.
అధిష్ఠానం తీరుపై పంజాబీనేతల గుర్రు
పంజాబ్‌లో పార్టీ సంస్థాగత నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆ రాష్ట్ర నేతల వాణి వినిపించుకోవడానికి అవకాశం ఇవ్వలేదని జీ-23 నేత ఒకరు అన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ ఎంపీలు పూర్తిగా నిరాశానిస్పృహలతో కాలం గడిపారని పంజాబ్ నేత ఒకరు పేర్కొన్నారు. సిద్ధూ నియామకంపై చర్చించడానికి టైం కోరినా సోనియాగాంధీ నిరాకరించారని ఆ నేత వాపోయినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్‌గా సిద్ధూ నియామకంపై ఎవరినీ సంప్రదించకుండానే రాహుల్, ప్రియాంక నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

