చెన్నై: తమిళనాడులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్తున్న కారు తిరువన్నమలై జిల్లాలోని చెంగమ్ సమీపంలో ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు చిన్నారులతోపాటు ఒక మహిళ ఉన్నారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను వెలికి తీయడం చాలా కష్టంగా మారింది. స్థానికులతో కలిసి అతికష్టం మీద మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.