న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ కిష్టార్లో ఆదివారం సాయంత్రం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు జవాన్లు గాయపడ్డారు. ఇందులో ముగ్గురిని హెలికాప్టర్ ద్వారా దవాఖానకు తరలించినట్టు అధికారులు తెలిపారు. కిష్టార్ సోనార్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా బలగాలు ‘ఆపరేషన్ త్రాషి-1’ని చేపట్టాయి. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టగా, కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు గ్రనేడ్ దాడులు కూడా చేశారని, జైషే మహమ్మద్ గ్రూప్‌నకు చెందిన వాళ్లుగా అనుమానిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.