Chandigarh Mayor Polls : బిహార్ సీఎం నితీష్ కుమార్ విపక్ష ఇండియా కూటమిని వీడి ఎన్డీయేలో చేరిన అనంతరం ఇండియా కూటమికి తొలి ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. చండీఘఢ్ మేయర్ ఎన్నికల్లో విపక్ష కూటమిపై బీజేపీ విజయం సాధించింది.
బీజేపీ అభ్యర్ధి మనోజ్ కుమార్ సోంకర్ ఆప్-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్‌పై విజయం సాధించారు. ఎక్స్అఫిషియో సభ్యుడు కిరణ్ ఖేర్ ఓటుతో సహా మనోజ్ సోంకర్‌కు 16 ఓట్లు దక్కించుకున్నారు. 35 మంది సభ్యులు కలిగిన చండీఘఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 16 స్ధానాలను గెలుపొందింది.
ఎనిమిది ఓట్లను చెల్లుబాటు కానివిగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మేయర్ పీఠం దక్కించుకున్నారు. కాషాయ పార్టీని దెబ్బతీయాలనే లక్ష్యంతో ఆప్-కాంగ్రెస్ కూటమి చెమటోడ్చినా విపక్ష కూటమికి చుక్కెదురైంది.
Read More :