Submarine Leak Case | ఇండియన్ నేవీ సబ్ మెరైన్ల కీలక సమాచారం లీక్ కేసులో ప్రస్తుతం నేవీలో పని చేస్తున్న ఒక కమాండర్‌తోపాటు మొత్తం ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. భారత నేవీలోని జలాంతర్గాముల సమాచారాన్ని బయటి వ్యక్తులకు చెప్పారని ఆరోపణలు ఉన్నాయి. సబ్మెరైన్లలోని ఎంఆర్‌సీఎల్ సమాచారాన్ని ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న కమాండర్లు.. రిటైర్డ్ అధికారులకు చేరవేశారని పేర్కొంది. సదరు రిటైర్డ్ అధికారులు దక్షిణ కొరియా కోసం పని చేస్తున్నారని అభియోగం.
గత సెప్టెంబర్ మూడో తేదీన రిటైర్డ్ నేవీ అధికారులు రణ్‌దీప్ సింగ్, ఎస్జే సింగ్‌ల అరెస్ట్‌తో అసలు సంగతి బయటపడింది. ఈ కేసులో సుమారు డజన్ మంది అధికారులకు సంబంధం ఉందని సీబీఐ అనుమానిస్తున్నది. రణదీప్ సింగ్ ఇంట్లో తనిఖీ చేసినప్పుడు రూ.2 కోట్ల నగదు సీబీఐ జప్తు చేసింది. ఇక నేవీ వెస్ట్ కమాండ్ కమాండర్ అజిత్ కుమార్ పాండేను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.