EPFO | ఈపీఎఫ్‌వో సభ్యులకు అలర్ట్.. మూడు రోజులు ఈపీఎఫ్‌వో పోర్టల్ సేవలు బంద్.. ఎప్పటినుంచంటే
EPFO : ఈపీఎఫ్‌వో సభ్యులకు ఆ సంస్థ కీలక సూచన చేసింది. మూడు రోజులపాటు ఈపీఎఫ్‌వో సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు తెలిపింది. పోర్టల్‌లో సాంకేతికపరమైన అప్డేట్స్ చేపడుతున్న నేపథ్యంలో జూన్ 26 నుంచి జూన్ 28 వరకు పోర్టల్‌కు సంబంధించినవ వివిధ సేవలు నిలిచిపోతాయని సంస్థ వెల్లడించింది.
EPFO : ఈపీఎఫ్‌వో సభ్యులకు ఆ సంస్థ కీలక సూచన చేసింది. మూడు రోజులపాటు ఈపీఎఫ్‌వో సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు తెలిపింది. పోర్టల్‌లో సాంకేతికపరమైన అప్డేట్స్ చేపడుతున్న నేపథ్యంలో జూన్ 26, అర్ధరాత్రి 12.00 గంటల నుంచి జూన్ 28 అర్ధరాత్రి 11.59 నిమిషాల వరకు పోర్టల్‌కు సంబంధించినవ వివిధ సేవలు నిలిచిపోతాయని సంస్థ వెల్లడించింది. పోర్టల్ నిర్వహణా సంస్థ దీనికి సంబంధించిన డాటా బేస్‌ను తన అధీనంలోకి తీసుకుని, పలు సాఫ్ట్వేర్ అప్డేట్లు చేయనుంది.
వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు వేగంగా అందించేందుకే ఈ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. అందువల్ల వినియోగదారులు ఈ పోర్టల్ సేవలు వాడాలి అనుకుంటే సేవలు నిలిచిపోకముందే వినియోగించుకోవాలని సూచించింది. పోర్టల్ తాత్కాలికంగా పని చేయని రోజులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. అయితే, అన్ని సేవలకు సమస్య ఉండకపోవచ్చని, కొన్ని సేవలు మాత్రం మూడురోజులు నిలిచిపోతాయని పేర్కొంది. కొత్త క్లెయిమ్ రిక్వెస్ట్ ఫాంలు సమర్పించడం, క్లెయిమ్ ప్రాసెసింగ్ సర్వీసెస్, మైగ్రేషన్ పీరియడ్‌కు సంబంధించిన క్లెయిమ్‌లు సమర్పించడం వంటివి నిలిచిపోవచ్చు. అయితే, మిగిలిన కొన్ని సేవల్ని పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి.
అవి ఉమాంగ్ యాప్, ఎస్ఎంఎస్, వాట్సాప్, మిస్డ్ కాల్ సర్వీసెస్ వంటివి వినియోగించుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాస్‌బుక్, క్లెయిమ్ స్టేటస్ వంటివి చూసుకోవచ్చు. అత్యవసరంగా పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ చేసుకోవాలనుకునే వారు జూన్ 25, అంటే ఈ రోజు అర్ధరాత్రి లోపే ఫాంలు సమర్పించాలి. త్వరలోనే ఈపీఎఫ్‌వోలో ఏటీఎం విత్‌డ్రా సదుపాయం అందుబాటులోకి రానున్నాయి. అలాగే, సభ్యులకు అకౌంట్లోని అమౌంట్‌పై వడ్డీ ఈ నెలలోనే జమ అయ్యే ఛాన్స్ ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

