న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో సర్వర్ సమస్యలు తలెత్తడంతో గురు, శుక్ర వారాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో (పీఎస్కే) సేవలకు ఆటంకం ఏర్పడింది. దీనిపై ఢిల్లీ, భోపాల్, థాణెల నుంచి పౌరులు పెద్దయెత్తున ఎక్స్‌లో ఫిర్యాదు చేశారు.
చివరి నిమిషంలో అపాయింట్మెంట్ల రద్దు, జాప్యాలపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. వెబ్సైట్, యాప్ సరిగ్గా పనిచేయడం లేదని పలువురు సామాజిక మాధ్యమంలో ఫిర్యాదు చేశారు.