Serum Partner CII | గ్రామాల వ్యాక్సినేషన్.. సీఐఐతో చేతులు కలిపిన సీరం
Serum Partner with CII | గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు ఎస్ఐఐ ముందడుగు వేసింది. సీఐఐతో శుక్రవారం భాగస్వామ్య ఒప్పందం .....

Serum Partner with CII గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కీలక ముందడుగు వేసింది. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)తో శుక్రవారం భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. కరోనాను నియంత్రించ డానికి దేశంలోని గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో వ్యాక్సినేషన్ వేగవంతానికి ఈ భాగస్వామ్య ఒప్పందం ఉపకరిస్తుంది.

సీఐఐతో ఒప్పందం వల్ల అంతరాయాల తొలగింపు
ఈ సందర్భంగా ఎస్ఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) అదార్ పునావాలా మాట్లాడుతూ సీఐఐతో భాగస్వామ్య ఒప్పందం వల్ల దేశవ్యాప్తంగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ల సరఫరాలో అంతరాయాలను తొలగించడానికి సరైన మార్గం అని అభిప్రాయ పడ్డారు. వాటాదారులందరితో కలిసి వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడానికి ఇది అవసరం అని అన్నారు.

ఫాస్ట్‌ట్రాక్ వ్యాక్సినేషన్ కోసం ఇలా..
సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ ఫాస్ట్‌ట్రాక్ వ్యాక్సినేషన్ కోసం ప్రజలను దవాఖానలు, కార్పొరేట్లలో అనుసంధానించాలని తమ లక్ష్యం అని చెప్పారు. పరిశ్రమల సహకారంతో భారీ స్థాయిలో వివిధ సామాజిక వర్గాలకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చేందుకు తమ భాగస్వామ్యం సహాయ పడుతుందన్నారు.
వివిధ పరిశ్రమల వర్కర్లు, వారి కుటుంబాలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సిన బాధ్యత పరిశ్రమలదే. అత్యవసరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలి. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టే చర్యలకు తోడ్పాటునిస్తామని టీవీ నరేంద్రన్ తెలిపారు.

కంపెనీలకు 7 కోట్ల సింగిల్ డోస్‌లు…
దేశవ్యాప్తంగా 196 నగరాల్లో 3000 పై చిలుకు కంపెనీలు ఉన్నాయి. వీటిలో జరిపిన సర్వే ప్రకారం 70 లక్షలకు పైగా సింగిల్ డోస్ వ్యాక్సిన్లు అవసరం ఉంది. సీఐఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 430 క్యాంపుల్లో ఈ నెల 23 వరకు 34,75, 301 మందికి సింగిల్ డోస్ అందించడం జరిగింది. ద్వితీయ శ్రేణి, త్రుతీయ శ్రేణి పట్టణాలు, నగరాలతోపాటు గ్రామాల్లో వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు సీఐఐ ప్రణాళిక రూపొందించింది.
గ్లోబల్ వ్యాక్సిన్ సప్లయర్‌గా సీరం
ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) నిలిచింది. బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న సంస్థ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలతో కలిసి ఎస్ఐఐ.. తయారు చేసిన వ్యాక్సిన్‌ను ఇండియాలో కొవిషీల్డ్ అని పిలుస్తారు.
దీంతోపాటు భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్లను ఈ ఏడాది జనవరి 16 నుంచి ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్ల నుంచి ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
బంగారానికి ఫుల్ గిరాకీ.. ఎంతంటే?!
సక్సెస్‌ఫుల్‌గా ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్.. 25.82 లక్షల ఐటీఆర్స్ దాఖలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

