న్యూఢిల్లీ, నవంబర్ 9: వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్‌ని ప్రశ్నించి సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ రాజకీయ వారసత్వాన్ని సమర్థించారు.
మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరతో అద్వానీని పోలుస్తూ కేవలం ఒక ఉదంతంతో సుదీర్ఘకాలం పాటు ఆయన దేశానికి అందించిన సేవలను తక్కువ చేయడం అన్యాయమని కేవలం ఒక ఉదంతంతో అద్వానీ రాజకీయ వారసత్వాన్ని తగ్గించడం అన్యాయం అని పేర్కొన్నారు.