రోహింగ్యాలను దేశం నుంచి పంపేయండి… మోదీ ప్రభుత్వానికి వీహెచ్పీ డిమాండ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోహింగ్యాలకు పునరావాసంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ (పీహెచ్పీ) తప్పుపట్టింది. వారిని వెంటనే దేశం నుంచి పంపేయాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాగా, రోహింగ్యాలను ఔటర్ ఢిల్లీలోని బక్కర్వాలాలోని అపార్ట్మెంట్లకు తరలిస్తామని గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. వారికి ప్రాథమిక సౌకర్యాలు, పోలీసు రక్షణ కల్పిస్తామని చెప్పారు. తిక్రీ సరిహద్దు సమీపంలోని బక్కర్వాలా ప్రాంతంలో ఇడబ్ల్యుఎస్ ఫ్లాట్లను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) నిర్మించిందని వెల్లడించారు.
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ (పీహెచ్పీ) వ్యతిరేకించింది. ఇప్పటికే పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు ఢిల్లీలోని మజ్ను-కా-తిలా ప్రాంతంలో అధ్వాన్నమైన పరిస్థితులలో జీవిస్తున్నారని వీహెచ్పీ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఆరోపించారు. ఈ ప్రాంతం సరిహద్దులోని అపార్ట్మెంట్ ప్లాట్లను రోహింగ్యాలకు మంజూరు చేయాలని ప్రతిపాదించడం మరింత శోచనీయమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని కోరారు. రోహింగ్యాలకు గృహ వసతి కల్పించే బదులు వారిని భారత్ నుంచి వెనక్కి పంపే ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
India has always welcomed those who have sought refuge in the country. In a landmark decision all #Rohingya #Refugees will be shifted to EWS flats in Bakkarwala area of Delhi. They will be provided basic amenities, UNHCR IDs & round-the-clock @DelhiPolice protection. @PMOIndia pic.twitter.com/E5ShkHOxqE
— Hardeep Singh Puri (@HardeepSPuri) August 17, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Rohingyas
- Send them back
- vhp
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

