Sena Leader : మాజీ మంత్రి, శివసేన నేత రాందాస్ కదం కుమారుడు సిద్ధేష్ కదం మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ)చైర్మన్‌గా నియమితులయ్యారు. ఏఎల్ జర్హాద్ స్ధానంలో సిద్ధేష్ కదం ఈ బాధ్యతలు చేపడతారని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎలాంటి కారణం లేకుండా దీర్ఘకాలంగా విధులకు దూరంగా ఉండటంతో జర్హాద్పై మహారాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. 2021 సెప్టెంబర్‌లో ఎంపీసీబీ చీఫ్‌గా జర్హాద్ నియమితులయ్యారు. సిద్ధేష్ కదం సోదరుడు యోగేష్ కదం దపోలి నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
సీఎం ఏక్నాథ్ షిండే సారధ్యంలోని శివసేనలో చురుకుగా పనిచేస్తున్నారు. రాందాస్ కదంను బుజ్జగించే క్రమంలోనే సిద్ధేష్ కదంకు కీలక పదవి కట్టబెట్టినట్టు చెబుతున్నారు. కాగా, ఎంపీసీబీ చీఫ్ నియామకానికి ప్రతిపాదిత అభ్యర్ధులకు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వ్యవహారంలో పాతికేండ్ల అనుభవం ఉండాలని అర్హతా నియమాల్లో పొందుపరిచారు.
Read More :
వంట గ్యాస్ ధర తగ్గింపు రాజకీయ ఎత్తుగడ : మోదీ సర్కార్‌పై భగ్గుమన్న విపక్షం