Watch: కక్ష్యలోకి ఎక్సోపోశాట్ శాటిలైట్.. వీడియో విడుదల చేసిన ఇస్రో
XPoSat | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఏడాది తొలి రోజున విజయకేతనం ఎగురవేసింది. పీఎస్ఎల్వీ-సీ58 (PSLV-C58) రాకెట్ ద్వారా ఎక్సోపోశాట్ (XPoSat) శాటిలైట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపింది. రాకెట్ నుంచి విడిపోయిన శాటిలైట్‌ను నిర్ణీత భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్‌ను ఇస్రో విడుదల చేసింది.
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఏడాది తొలి రోజున విజయకేతనం ఎగురవేసింది. పీఎస్ఎల్వీ-సీ58 (PSLV-C58) రాకెట్ ద్వారా ఎక్సోపోశాట్ (XPoSat) శాటిలైట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపింది. రాకెట్ నుంచి విడిపోయిన శాటిలైట్‌ను నిర్ణీత భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్‌ను ఇస్రో విడుదల చేసింది.
కాగా, అంతరిక్షంలోని రహస్యాలను అణ్వేషించే పోలారిమెట్రీ మిషన్ ద్వారా ఖగోళ పరిశోధనల పరంగా అమెరికా తర్వాత రెండవ దేశంగా భారత్ నిలిచింది. విశ్వంలోని బ్లాక్‌హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియైలు, పల్సర్ విండ్ నెబ్యులే వంటి ఖగోళ మూలాలకు సంబంధించిన వివరాలను అర్థం చేసుకోవడంలో పోలారిమెట్రీ మిషన్ సహకరిస్తుంది.
మరోవైపు ఇస్రో చీఫ్ సోమనాథ్ ఈ ప్రయోగం విజయంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కొత్త ఏడాదిలోని 12 నెలల్లో 12 ప్రయోగాలు చేపట్టడం తమ లక్ష్యమని తెలిపారు. తమ శక్తి, సామర్థ్యాలు, అనుకూల పరిస్థితుల మేరకు ఈ ఏడాది ప్రయోగాల సంఖ్య 14 వరకు ఉండవచ్చని అంచనా వేశారు. 2025లో చేపట్టనున్న గగన్‌యాన్‌కు 2024 సంసిద్ధత సంవత్సరంగా పేర్కొన్నారు. ఈ మిషన్‌కు సంబంధించిన పలు కీలక ప్రయోగాలను ఈ ఏడాదిలో పరీక్షిస్తామని వెల్లడించారు.
PSLV-C58 on board camera views. #XPoSat pic.twitter.com/vOtaLvGqAj
— ISRO (@isro) January 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Earth orbit
- ISRO
- PSLV-C58
- Satellite
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

