ముంబై, జూలై 7 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా తీరంలో భారత నౌకాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించింది. అది పాకిస్థాన్ నౌక అయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవ దండా తీరంలోని కొర్లాయ్ బీచ్ సమీపంలో ఈ అనుమానాస్పద నౌక కనిపించడంతో నేవీ, పోలీసులు రాయ్‌గఢ్ తీరం వెంబడి భద్రతను మరింత పెంచారు.
రాయ్‌గఢ్ ఎస్పీ అంచల్ దలాల్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు తీరానికి చేరుకున్నారు. ఆ నౌకను చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేని కారణంగా వారు వెనుదిరిగారు.