న్యూఢిల్లీ, మే 1: అమృత్సర్లోని ఇండో-పాక్ సరిహద్దులో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పంజాబ్ పోలీస్, బీఎస్ఎఫ్ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో.. భారోపాల్ అనే గ్రామానికి దగ్గర్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉగ్రవాదులు రహస్యంగా దాచిపెట్టిన మందుగుండు, తుపాకులు, గ్రనేడ్లు బయటపడ్డాయి.
బుధవారం నాటి సెర్చ్ ఆపరేషన్లో రెండు హ్యాండ్ గ్రనేడ్లు, మూడు పిస్తోళ్లు, ఆరు మ్యాగజైన్లు, 50 రౌండ్ల బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు.