Chaina | చెన్నై, జూలై 11: నిషేధిత రసాయనాలు ఉన్న చైనా కార్గో కంటైనర్ను తమిళనాడులోని కట్టుపల్లి ఓడరేవు వద్ద కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ జీవ, రసాయన యుద్ధం కోసం ఈ రసాయనాలను చైనా పంపుతున్నట్టు కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
టియర్గ్యాస్గా వాడే (ఆర్థో క్లోరో బెంజైలిడిన్ మాలోనోనిట్రైల్) కెమికల్ చైనా కంటైనర్లో పెద్ద మొత్తంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అల్లర్లు, నిరసనల్ని నియంత్రించటానికి, సైనికపరంగానూ వాడొచ్చునని వారు తెలిపారు. రావల్పిండిలోని రక్షణ ఉత్పత్తులను సరఫరా చేసే సంస్థకు రసాయనాలను పంపుతున్నట్టు అధికారులు గుర్తించారు.