జమ్ము, మే 22: జమ్ముకశ్మీర్‌లోని కిష్టార్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. గురువారం ఉదయం ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లో ఒక జవాన్ వీర మరణం పొందారు.
‘ఛాత్రూలోని షింగ్పోరా ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు దాక్కున్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకోగా, ఓ జవాన్ అత్యంత ధైర్యసాహసాలు చూపుతూ గాయపడ్డారు. దవాఖానకు తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు’ అని వైట్‌నైట్ కార్ప్స్ ‘ఎక్స్’లో పేర్కొన్నది.