ఆదివారం 17 జనవరి 2021
National - Nov 27, 2020 , 14:45:53

మిగ్‌ పైల‌ట్ కోసం కొన‌సాగుతున్న గాలింపు..

మిగ్‌ పైల‌ట్ కోసం కొన‌సాగుతున్న గాలింపు..

హైద‌రాబాద్‌:  అరేబియా స‌ముద్రంలో మిగ్‌-29కే శిక్ష‌ణ విమానం ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఒక పైల‌ట్‌ను ర‌క్షించారు.  అయితే మ‌రో పైల‌ట్ కోసం గాలింపు జ‌రుగుతున్న‌ట్లు భార‌తీయ నౌకాద‌ళం త‌న ట్వీట్‌లో తెలిపింది.  క‌మాండ‌ర్ నిషాంత్ సింగ్ కోసం అన్ని యూనిట్లు గాలిస్తున్న‌ట్లు నేవీ ప్ర‌తినిధి తెలిపారు. న‌వంబ‌ర్ 26వ తేదీన సాయంత్రం 5 గంట‌ల‌కు మిగ్ విమానం ప్ర‌మాదానికి గురైంది.  అయితే క‌నిపించ‌కుండా పోయిన రెండ‌వ పైల‌ట్ కోసం నిన్న సాయంత్రం నుంచి గాలింపు జ‌రుగుతున్న‌ట్లు అధికారులు తెలిపారు.  మిగ్ ప్ర‌మాదం ప‌ట్ల ఉన్న‌త స్థాయి విచార‌ణ‌కు ఆదేశించారు.

ఇండియ‌న్ నేవీ వ‌ద్ద దాదాపు 40కు పైగా మిగ్ 29కే యుద్ధ విమానాలు ఉన్నాయి. గోవాతో పాటు ఐఎన్ఎస్ విక్ర‌మాదిత్య యుద్ధ నౌక‌పై వాటిని ఆప‌రేట్ చేస్తున్నారు. గ‌త ఏడాది కాలంలో మిగ్ విమానం ప్ర‌మాదానికి గురికావ‌డం ఇది మూడ‌వ‌సారి.  ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో గోవా వ‌ద్ద ప‌క్షుల ఢీకొట్ట‌డంతో మిగ్ కూలింది. అయితే ఆ ప్ర‌మాద స‌మ‌యంలో ఇద్ద‌రు పైల‌ట్లు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో గోవా స‌మీపంలోనే ఓ మిగ్‌29కే కూలింది. అప్పుడు కూడా ఇద్ద‌రు పైల‌ట్లు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.