Watch: రూ.970 సర్వీస్ ఛార్జీ విధించిన రెస్టారెంట్.. కస్టమర్లు, సిబ్బంది మధ్య ఫైట్
Scuffle | ఒక రెస్టారెంట్లో ఏకంగా సుమారు వెయ్యి రూపాయలు సర్వీస్ ఛార్జీ విధించారు. కస్టమర్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కస్టమర్లు, సిబ్బంది మధ్య ఫైట్ జరిగింది (Scuffle breaks out). ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది.
లక్నో: ఒక రెస్టారెంట్లో ఏకంగా సుమారు వెయ్యి రూపాయలు సర్వీస్ ఛార్జీ విధించారు. కస్టమర్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కస్టమర్లు, సిబ్బంది మధ్య ఫైట్ జరిగింది (Scuffle breaks out). ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం సెక్టార్ 75లో ఉన్న స్పెక్ట్రమ్ మాల్లోని డ్యూటీ ఫ్రీ రెస్టారెంట్‌కు 12-13 మంది ఉన్న ఒక కుటుంబం వెళ్లింది. ఫుడ్ తిన్న తర్వాత బిల్లు చూసి వారు షాకయ్యారు. బిల్లులో రూ.970 సర్వీస్ ఛార్జ్ విధించారు. ఆ కుటుంబ సభ్యులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా విధించిన సర్వీస్ ఛార్జ్‌ను బిల్లు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కాగా, రెస్టారెంట్ సిబ్బంది దీనికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు, రెస్టారెంట్ సిబ్బంది తిట్టుకోవడంతోపాటు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆ రెస్టారెంట్‌కు చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని అదుపు చేశారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు. స్పెక్ట్రమ్ మాల్లోని ఆ రెస్టారెంట్‌ను మూడు నెలల కిందటే ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
https://twitter.com/gharkekalesh/status/1670478724461109248?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1670478724461109248%7Ctwgr%5E762c30a6b38475638e6c74df6bf3ec997e077005%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.timesnownews.com%2Fmirror-now%2Fcrime%2Fon-camera-scuffle-between-family-restaurant-staff-at-noida-mall-over-service-charge-article-101099063
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

