రాయ్‌పూర్: మహిళా పోలీస్‌పై, పోలీస్ సిబ్బంది కుటుంబాలకు చెందిన మహిళలు దాడి చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ నెల 10న ఈ ఘటన జరిగింది. జీతం పెంచాలని డిమాండ్ చేస్తూ పోలీసు సిబ్బంది కుటుంబాలకు చెందిన మహిళలు నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ రోడ్డును దిగ్బంధించారు. దీంతో పోలీస్ సిబ్బంది కుటుంబాలకు చెందిన మహిళలను అరెస్ట్ చేసేందుకు మహిళా పోలీసులు ప్రయత్నించగా ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా ఒక మహిళా పోలీస్‌పై నిరసన చేస్తున్న మహిళలు మూకుమ్మడిగా దాడి చేసి కొట్టారు.
కాగా, సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నించారని, అయితే నిరసనకు దిగన మహిళలు తమ సిబ్బందిని నెట్టి తప్పుగా ప్రవర్తించారని రాయ్‌పూర్ అదనపు ఎస్పీ తారకేశ్వర్ పటేల్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Raipur, Chhattisgarh: A scuffle had broken out between police and women allegedly belonging to families of police personnel who were demanding a hike in salary (10.01.2022) pic.twitter.com/LFqOFtfIsc
— ANI (@ANI) January 12, 2022