న్యూఢిల్లీ : రోహింగ్యా శరణార్థులు దేశంలో అదృశ్యమవుతున్నారని దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు వారి చొరబాటుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చట్టబద్ధ అనుమతి లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారికి న్యాయ వ్యవస్థ అసాధారణమైన రక్షణ కల్పించాలా? అని సీజేఐతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. ‘మేం వారికి ఎర్ర తివాచీ పరచాలా?’ అని సీజేఐ సూర్యకాంత్ ప్రశ్నించారు.