Scorpion: ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికురాలిని కుట్టిన తేలు
Scorpion: విమాన ప్రయాణికురాలిని ఓ తేలు కుట్టింది. విమానంలో గాలిలో ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది. దీనిపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది.ఆ ప్రయాణికురాలు ప్రస్తుతం బాగానే ఉన్నట్లు చెప్పింది.
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా(Air India) విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్యాసింజెర్ను తేలు(Scorpion) కుట్టింది. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన ఈ ఘటన గురించి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నాగపూర్ నుంచి ముంబై వెళ్తున్న ఫ్లయిట్లో ఈ ఘటన జరిగింది. ఎయిర్పోర్టులో దిగగానే ఆ ప్రయాణికురాలికి వైద్యులు చికిత్స అందించారు. ట్రీట్మెంట్ తర్వాత ఆ మహిళను డిస్చార్జ్ చేశారు.
ప్రస్తుతం ఆ ప్రయాణికురాలు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లయిట్ ఏఐ 630లో ఏప్రిల్ 23వ తేదీన ఈ ఘటన జరిగినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రయాణికురాలు ఇచ్చిన ఫిర్యాదు తర్వాత తమ ఇంజనీరింగ్ బృందం ఆ విమానంలో విస్తృతంగా సోదాలు చేసినట్లు ప్రతినిధి చెప్పారు. ప్రయాణికురాలికి కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

