Weather | ఏపీలో మండిపోతున్న ఎండలు.. గూడూరులో రికార్డు ఉష్ణోగ్రతలు..!
Weather | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరులో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం అక్కడ ఏకంగా 45.8 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 216 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
Weather : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరులో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం అక్కడ ఏకంగా 45.8 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 216 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
రేపు (శుక్రవారం) పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లోని తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని జైన్ తెలిపారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా వర్షం పడే సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాల హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

