Gold | న్యూఢిల్లీ, డిసెంబర్ 30: అత్యంత విలువైన, ఆకర్షణీయమైన భార లోహాల్లో ముఖ్యమైంది బంగారం. అయితే అంతరిక్షంలో ‘కిలోనోవా’ ఘటన సంభవించినప్పుడు కూడా బంగారం, సహా ఇతర భార లోహ మూలకాలు పుడుతున్నాయని ‘కిలోనోవా’పై పరిశోధన చేస్తున్న మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ పోట్స్‌డ్యామ్ సైంటిస్టుల బృందం పరిశోధన తెల్చింది.
అత్యంత శక్తివంతమైన గామా కిరణాలు, కాస్మిక్ కిరణాలు, ఎక్స్-కిరణాలు వెలువడి అంతరిక్షంలో భార లోహ మూలకాలు ఉద్భవించడానికి కారణమవుతున్నదని అంచనా వేశారు.