న్యూఢిల్లీ: మూత్ర విసర్జనకు పట్టే సమయాన్ని బట్టి ఆరోగ్య స్థితిని గుర్తించవచ్చని పరిశోధకులు గుర్తించారు. మూత్రాశయాన్ని పర్యవేక్షిస్తూ, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఓ చిన్న చిట్కా ఉందని వారు తెలిపారు. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు నిర్వహించిన అధ్యయనం ఈ చిట్కాకు ప్రేరణనిచ్చింది. మనుషులు సుమారు 21 సెకండ్లలో మూత్ర విసర్జనను పూర్తి చేయడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనం వెల్లడించింది. పదేపదే మూత్రవిసర్జన చేసినా, తక్కువసార్లు చేసినా ఆరోగ్యానికి నష్టమేనని తేలింది.