న్యూఢిల్లీ, ఆగస్టు 8: అంగారకుడు మునుపటి కంటే వేగంగా తిరుగుతున్నాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నాసాకు చెందిన ఇన్సైట్ ల్యాండర్ అంగారకుడిపై నాలుగేండ్ల పాటు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి సైంటిస్టులు ఈ అభిప్రాయానికి వచ్చారు.
జర్నల్ నేచర్లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఏటా ఈ గ్రహం భ్రమణ వేగం 4 మిల్లియార్క్సెకండ్లు పెరిగిందని అంచనా వేశారు. అయితే ఇలా ఎందుకు జరుగుతున్నదో కచ్చితంగా తమకు తెలియడం లేదని వారు తెలిపారు. అంగారకుడి ధ్రువాల పై భాగంలో మంచు పేరుకుపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.