న్యూఢిల్లీ: ‘ఆదిమ మానవులు జంతువులను వేటాడి పచ్చి మాంసం, పచ్చి కూరగాయలతో కడుపు నింపుకొనేవారు. మానవ జాతి ముఖ్యమైన పరిణామ క్రమాల్లో ఆహారాన్ని ఉడికించుకొని తిన్నారు’ అనే మనకు ఇప్పటి వరకు తెలుసు. మనం అనుకొన్న దాని కంటే 7.8 లక్షల ఏండ్ల కిందటే మనుషులకు వంట చేయడం తెలుసని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 10-20 లక్షల ఏండ్ల క్రితం ప్రారంభ జాతి మానవుల్లో పొడవాటి శరీరం, పెద్ద మెదడు ఉండేదని.. క్యాలరీలు అధికంగా ఉండే వండిన ఆహారం తినడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.