చండీఘడ్: పంజాబ్(Punjab)లోని అయిదు జిల్లాల్లో స్కూళ్లను తెరిచారు. ఆరు రోజుల తర్వాత ఇవాళ మళ్లీ ఓపెన్ చేశారు. ఇండో, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే. మే 8వ తేదీన మూడు రోజుల పాటు స్కూళ్లను మూసివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చాలా వరకు స్కూళ్లను ఓపెన్ చేశారు. ఇక ఆరు జిల్లాల్లో వాటిని నేటి నుంచి తెరిచారు.
పాకిస్థాన్‌తో పంజాబ్‌కు 553 కిలోమీటర్ల బోర్డర్ ఉన్నది. అమృత్సర్, తర్న్ తారన్, పఠాన్‌కోట్, ఫజిల్కా, ఫిరోజ్ఫుర్, గుర్దాస్పుర్ జిల్లాలు బోర్డర్లో ఉన్నాయి. గురుదాస్‌పూర్‌లో మంగళవారం స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్కూళ్లను తెరుస్తున్నట్లు అమృత్‌సర్‌లో ఓ స్కూల్ టీచర్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు స్కూళ్లు తెరిచి ఉంటాయని అమృత్సర్ జిల్లా యాజమాన్యం పేర్కొన్నది.
ఇండో, పాక్ దేశాలు కాల్పుల విరమణకు మే 10వ తేదీన అంగీకరించిన విషయం తెలిసిందే.