Manipur Protests | మణిపూర్‌లో మళ్లీ నిరసనలు.. మూడు రోజుల పాటు విద్యాసంస్థలు బంద్
Manipur Protests | బీజేపీ పాలిత మణిపూర్‌లో మళ్లీ నిరసనలు ఉధృతమయ్యాయి. దీంతో శాంతిభద్రతల పరిస్థితి కారణంగా స్కూల్స్, కాలేజీలు, విద్యా సంస్థలను మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇంఫాల్: బీజేపీ పాలిత మణిపూర్‌లో మళ్లీ నిరసనలు ఉధృతమయ్యాయి. దీంతో శాంతిభద్రతల పరిస్థితి కారణంగా స్కూల్స్, కాలేజీలు, విద్యా సంస్థలను మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. (Manipur Protests) మణిపూర్‌లో జనాభా గణనకు ముందే జాతీయ పౌర పట్టిక (ఎన్సార్సీ)ని నవీకరించాలని ప్రజలు కోరుతున్నారు. అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తులు (ఐడీపీలు) తమ స్వస్థలాలకు తిరిగి వచ్చేవరకు జనాభా గణన నిర్వహించవద్దని డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన, నిష్పక్షపాత పునర్విభజన ప్రచార సంస్థ (జేఎఫ్‌డీ) వేదికగా దీనిపై పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 48 గంటల సార్వత్రిక సమ్మెకు జేఎఫ్‌డీ పిలుపునిచ్చింది.
కాగా, సమ్మెలో భాగంగా మణిపూర్ లోయ జిల్లాలలోని పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్లను దిగ్భందించారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖురాయ్ లామ్లాంగ్లో సీఎం ఖేమ్‌చంద్ సింగ్, హోం మంత్రి గోవిందాస్ కొంతౌజమ్ల దిష్టిబొమ్మలను నిరసనకారులు దహనం చేశారు.
మరోవైపు సార్వత్రిక సమ్మెలో భాగంగా నిరసనలు కొనసాగడంతో గురువారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను బహిష్కరిస్తున్నట్లు జేఎఫ్‌డీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితి కారణంగా ఆగస్ట్ 20 నుంచి 22 వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. తౌబల్ జిల్లాలో ఏర్పాటు చేసిన జనగణన శిక్షణా కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
#WATCH | Manipur | People hold protests in Imphal under the Campaign for Just and Fair Delimitation’s (JFD) call, demanding the conduct and update of the National Register of Citizens (NRC) before the Census. Police put up barricades to control the crowd.
A protestor says, “We… pic.twitter.com/2C6xO3nHnK
— ANI (@ANI) August 20, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

