Junior Asia Cup : ఏహెచ్ఎఫ్ జూనియర్ ఆసియా కప్‌లో భారత్ పంజా విసిరింది. టాప్ గేర్‌లో ఆడిన టీమిండియా ఏకంగా రెండు విభాగాల్లోనూ పసిడితో మెరిసింది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో దక్షిణ కొరియాపై అబ్బాయిల జట్టు జయభేరి మోగించగా.. ఉత్కంఠ పోరులో చైనాకు చెక్ పెట్టారు అమ్మాయిలు. దాంతో.. స్వల్ప వ్యవధిలోనే పోడియం మీద మువ్వన్నెల జెండా రెండుసార్లు రెపరెపలాడింది. అంతేకాదు ఎఫ్ఐహెచ్ జూనియర్ వరల్డ్‌కప్ బెర్తును సొంతం చేసుకుంది.
హాకీలో సీనియర్ జట్లు విఫలమైనా.. జూనియర్ టీమ్ మాత్రం పసిడి పతకం కొల్లగొట్టింది. ఆసియా కప్‌లో పురుషుల, మహిళల జట్లు అద్భుత విజయంతో స్వర్ణం సాధించాయి. ఆదివారం టైటిలో పోరులో అబ్బాయిల బృందం చేతిలో దక్షిణ కొరియా కంగుతినగా.. అమ్మాయిల ధాటికి చైనా తోకముడిచింది.
𝗜𝗡𝗗𝗜𝗔 𝗔𝗥𝗘 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦 𝗔𝗚𝗔𝗜𝗡! 👑🇮🇳
The Indian Junior Men’s Team beats South Korea 4–1 in the AHF Junior Asia Cup 2026 final to successfully defend their title! 🏑⚡
And with the title secured, India have also booked their ticket to the FIH Junior World Cup!… pic.twitter.com/tDTeNNQRSC
— Hockey India (@TheHockeyIndia) September 13, 2026
కొరియాతో ఫైనల్లో 4-1తో విజయం సాధించింది పురుషుల జట్టు. ఆట మొదలైన 9వ నిమిషంలోనే అజీత్ యాదవ్ గోల్ చేయగా.. అన్మోల్ ఎక్కా 13వ నిమిషంలో, ప్రభ్‌దీప్ సింగ్ గోల్‌తో తొలి అర్థ భాగంలోనే భారత్ పైచేయి సాధించింది. రెండో అర్థ భాగంలో కొరియా ఖాతా తెరిచినా అశూ మౌర్యలు చెరొక గోల్‌తో టీమిండియా స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందింది. తద్వారా ఎఫ్ఐహెచ్ జూనియర్ వరల్డ్‌కప్ బెర్తు పట్టేసింది.
టైటిల్ పోరులో అమ్మాయిల జట్టు సైతం గొప్పగా ఆడి చైనాను నిలువరించింది. దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని అడ్డుకున్న టీమిండియా 1-0తో గోల్డ్ మెడల్ కొల్లగొట్టింది. ఈ విజయంతో ఐదో ఎఫ్ఐహెచ్ జూనియర్ వరల్డ్‌కప్ పోటీలకు అర్హత సాధించింది టీమిండియా. సంచలన ప్రదర్శనతో ఆసియా కప్ గెలుపొందిన మహిళల జట్టుకు హాకీ ఇండియా రివార్డులు ప్రకటించింది. స్క్వాడ్‌లోని ప్లేయర్లకు రూ.3 లక్షలు, కోచింగ్ సిబ్బందికి తలా రూ.1.5 లక్షల నగదు బహుమతి ప్రకటించింది.
𝗔 𝗪𝗘𝗟𝗟-𝗗𝗘𝗦𝗘𝗥𝗩𝗘𝗗 𝗥𝗘𝗪𝗔𝗥𝗗! 🏆🇮🇳
Hockey India rewards the Indian Junior Women’s Team for their title-winning campaign at the AHF Junior Asia Cup 2026!
₹3 lakh to each player and ₹1.5 lakh to each of the support staff. 🥇🔥
The title win also confirms a spot… pic.twitter.com/CO5kP3pFJP
— Hockey India (@TheHockeyIndia) September 13, 2026