బెంగళూరు: ఒక బాలిక ధైర్య సాహసాలను ప్రదర్శించింది. బోల్తాపడిన ఆటో కింద ఉన్న తల్లిని కాపాడింది. ఒంటి చేత్తో ఆటోను పైకి లేపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Girl Lifts Auto To Save Mother ) కర్ణాటకలోని మంగళూరులో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాజరత్నపుర ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల చేతన రోడ్డు వద్దకు చేరుకున్నది. ఏడో తరగతి చదువుతున్న కుమార్తె వైభవిని ట్యూషన్ తర్వాత ఇంటికి తీసుకువెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేసింది.
కాగా, ఒక ఆటో అతి వేగంతో రోడ్డుపై వెళ్తున్నది. రోడ్డు దాటుతున్న చేతనను ఢీకొట్టకుండా నివారించేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కన బైక్‌పై ఉన్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. ఆ ఆటో కింద చేతన చిక్కుకున్నది.
మరోవైపు దీనిని గమనించిన ఆమె కుమార్తె వైభవి వెంటనే స్పందించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కతే ఆటోను పైకి లేపింది. దాని కింద చిక్కుకున్న తల్లిని ఆ బాలిక కాపాడింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది. ఆటో డ్రైవర్‌తోపాటు ఒక ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో తల్లిని కాపాడేందుకు ఒక్కతే ఆటోను పైకి లేపిన ఆ బాలిక ధైర్య సాహసాలను నెటిజన్లు ప్రశంసించారు.
In #Karnataka‘s #Mangaluru, a woman was seriously injured at #Ramanagara, #Kinnigoli, after being hit by a speeding auto-rickshaw while crossing the road.
The injured woman, Chethana (35), a resident of #Rajaratnapura, was collecting pigmy deposits when the accident occurred.… pic.twitter.com/9umH1Dgdal
— Hate Detector 🔍 (@HateDetectors) September 9, 2024