న్యూఢిల్లీ, ఆగస్టు 20: కౌమార బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలని సూచిస్తూ కలకత్తా హైకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఆ కేసులో నిందితుడికి విధించిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది.
ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి కింది కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై నిందితుడు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు… అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తూ గత ఏడాది అక్టోబర్ 18న తీర్పు ఇచ్చింది. బాలిక అతడితో ఇష్టపూర్వకంగా సాన్నిహిత్యం కొనసాగించిందన్న కారణంతో నిందితున్ని నిర్దోషిగా ప్రకటించింది.