Home
National
Sc Says Karnataka Government Decision On Scrapping 4 Per Cent Muslim Quota Prima Facie Based On Absolutely Fallacious Assumption
Muslim Quota: ముస్లింలకు 4 శాతం కోటా రద్దు.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
Muslim quota: కర్నాటక సర్కారు రద్దు చేసిన 4 శాతం ముస్లిం కోటాపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 18వ తేదీన ఈ అంశంపై మళ్లీ విచారించనున్నది. కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది.
న్యూఢిల్లీ: ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్(Muslim Quota)ను కర్నాటక ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దానిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తప్పుడు అభిప్రాయాలపై కర్నాటక సర్కార్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. వొక్కలింగ, లింగాయత్‌లకు చెరో రెండు శాతం రిజర్వేషన్లు పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలింగ, లింగాయత్‌లు రిజర్వేషన్ కల్పించడం పట్ల సుప్రీం విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయంలో లోపాలు ఉన్నట్లు సుప్రీం పేర్కొన్నది. ఈ కేసును మళ్లీ ఏప్రిల్ 18వ తేదీ విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

