న్యూఢిల్లీ, జూన్ 4 : ఫెర్టిలిటీ క్లినిక్లను నియంత్రించే నిబంధనల చట్రంలోని లోపాలను ఆసరాగా చేసుకుని పిల్లల అక్రమ రవాణా కొత్త నెట్వర్క్లు పుట్టుకొస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ(ఏఆర్టీ), సరోగసీ కేంద్రాల ద్వారా పిల్లల అక్రమ రవాణాను నిరోధించడానికి ఒక ప్రత్యేక యంత్రాంగం అవసరాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నది.
ఏఆర్టీ, సరోగసీ కేంద్రాల ద్వారా జరిగే అక్రమ రవాణాను నివారించడానికి ఎటువంటి ప్రామాణిక కార్యాచరణ విధానం(ఎస్వోపీ) లేదని పేర్కొంటూ అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది అపర్ణాభట్ చేసిన వాదనలను పింకీ వర్సెస్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బాలల అక్రమ రవాణా కేసులో తమ 2025 ఏప్రిల్ తీర్పు అమలును ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.